కేంద్రమంత్రి బండి సంజయ్ శుక్రవారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం పీఠం నుంచి దించాలని కాంగ్రెస్ మంత్రులు చూస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గోతికాడ నక్కలా రేవంత్‌ను దింపేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. హైడ్రా, మూసీ, గ్రూప్-1 విషయంలో జాగ్రత్త పడకపోతే రేవంత్ రెడ్డికు చిక్కులు తప్పవని బండి సంజయ్ సూచించారు.