సికింద్రాబాద్: మాటలు ప్రజలకు, మూటలు పార్టీకి అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా వ్యవహరించేదని, కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడాలేదని మండిపడ్డారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి అబద్ధాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దోపిడీలు మక్కీ టు మక్కీగా ఉన్నాయని ఆరోపించారు.