తల్లి కుమారుడు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ సబిత తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరనగర్ కు చెందిన బసవరాజుల రూప (36) కుమారుడు అభిరామ్(9) ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. రూప భర్త రాజు అనారోగ్యంతో వరంగల్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భర్త బంధువులు ఇందిరనగర్ కు రాగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. రూప 3 నెలలుగా కనిపించడం లేదని ఇంటి ఓనర్ చెప్పడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.