ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 40 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వివిధ శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులపై స్పందించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.