నార్సింగిలో వెలసిన మల్లికార్జున స్వామి సహిత కేతకి భ్రమరాంబా అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఆదివారం ఉదయం 11. 05 గంటలకు నిర్వహించనున్నట్టు దేవాలయ నిర్వహణ కర్త, కాంగ్రెస్ పార్టీ నార్సింగి మున్సిపాలిటీ అధ్యక్షుడు కె. అశోక్ యాదవ్ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు గోపూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, తదితర పూజలు ఉంటాయన్నారు.