కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా డబ్బులు, సమయం వృథా చేసుకోకుండా కేసులను పరిష్కరించవచ్చునని రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీ సెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి తెలిపారు. అత్తాపూర్ వాసుదేవారెడ్డినగర్ కాలనీలో నాంపల్లి శ్రీకాంత్, శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ మీడి యేషన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.