రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఫ్యామిలీ డిటిజల్ కార్డు ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సులువు అవుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని పెద్దతూప్ర తండాలో చేపట్టిన ఇంటింటి సర్వే తీరును శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సర్వేలో అధికారులు సేకరిస్తున్న వివరాలను గ్రామస్తులు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ తండాను ఎంపిక చేసినట్లు తెలిపారు.