ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ లోని పద్మశ్రీకాలనీ, డాక్టర్స్ కాలనీ, నర్సారెడ్డి కాలనీలో డ్రైనేజీ, వాటర్ లైన్, సీసీ రోడ్డు డెవలప్మెంట్ పై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను కలిసి కార్పొరేటర్ పద్మావతిపాపయ్య యాదవ్ సమస్యలను వివరించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.