రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్పల్లి డివిజన్లో నేతాజీ నగర్ నుండి సాయిబాబా నగర్ కు వెళ్ళే రహదారి పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది. ఈ రహదారిపై డ్రైనేజీ నీరు నిలిచిపోయి గుంతలు ఏర్పడి, ప్రమాదకర పరిస్థితి నెలకొంది.ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు మరియు పాదచారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.శుక్రవారం స్థానికులు ఈ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.