మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బుధవారం నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ రికార్డ్ చేయనున్నారు. అయితే గత విచారణ సందర్భంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కేటీఆర్ కొంత సమయంలో కోరడంతో న్యాయమూర్తి కేసును ఇవాళ్టికి వాయిదా వేశారు.