వృద్ధుడు అదృశ్యం

68பார்த்தது
వృద్ధుడు అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోలు జైపురికాలనీకి చెందిన పరవస్తు కృష్ణ గత నెల 30న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులలో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణకు మాటలు కూడా సరిగా రావని తెలిపారు.

தொடர்புடைய செய்தி