ఖమ్మం జిల్లాకు చెందిన అచ్యుత రావు, బిజ్జగాని సుగుణ రాజు, కస్మాపాసాటి కొండయ్యలు స్నేహితులు. వీరి మరో స్నేహితుడు దొంగతనం కేసులో జైలులో ఉండగా, బెయిల్ ఇప్పించడానికి షూరిటీ ఇచ్చేందుకు శుక్రవారం కూకట్పల్లి కోర్ట్ కు వెళ్లారు. బెయిల్ వాయిదా పడడంతో ఇంటికి వెళ్దాం అనుకుంటున్న సమయంలో కొండయ్య బహిర్భుమికి వెళ్ళాడు. ఎంత చూసిన రాకపోవడంతో శనివారం కోర్ట్ చుట్టు పక్కల వెతకగా ఒక మురుగు కాలువలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.