మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి ఉన్నారు.