విదేశాలకు వెళ్లాలనే మోజు ఈతరం విద్యార్థులను కొత్త రోగంలా పట్టుకుందని శనివారం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మండిపడ్డారు. భారత విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తుండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంతో పాటు మేధస్సు కలిగిన మానవ వనరులను కోల్పోతున్నామన్నారు. ‘‘విద్యను వ్యాపారంగా మార్చడం వల్ల దాని నాణ్యత తగ్గిపోతోంది. దేశ భవిష్యత్తుకు అది ఏమాత్రం మంచిది కాదు’’ అని ఉప రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు.