యాచారం మండల పరిధిలోని మల్కిస్ గూడా, మేడిపల్లి నక్కర్త, గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు పూర్తిగా పాడైంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఏండ్ల క్రితం నిర్మించిన రోడ్డు కావడంతో మేడిపల్లి గ్రామ సమీపాన ఉన్న కల్వర్టు దాటినాక బీటీ రోడ్డు పైన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కంకర రాళ్లు బయటపడటంతో ఆ రోడ్డు గుండా ప్రయాణాలు చేసే వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. ఆర్. అండ్. బి అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలనీ కోరుతున్నారు.