కొండచిలువ.. దానిని చూస్తేనే గుండెల్లో గుబులు పుడుతుంది. అది ఒకసారి దేన్నైనా చుట్టుకుందంటే ఊపిరాడక చనిపోవాల్సిందే. కొండచిలువకు అంతబలం ఉంటుంది. అందుకే కొండచిలువ కనిపిస్తే.. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండరు. తాజాగా ఓ భారీ కొండచిలువ ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది. దీంతో దాని కడుపు బాగా ఉబ్బడంతో కదల్లేక.. కక్కలేక.. మింగలేక నానా అవస్థలు పడింది. యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.