మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన పితాంపూర్‌కు భోపాల్ నుండి యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పెద్ద దుమారం చెలరేగింది. ఈ అంశంపై శుక్రవారం చేపట్టిన బంద్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ నిరసనలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకున్నారు. ఇంతలో పొరపాటుగా నిప్పు అంటుకోవడంతో మంటల్లో వారు కాలిపోయారు. బాధితులను స్థానికులు హుటాహుటిన ఇండోర్ ఆసుపత్రికి తరలించారు.