తెలంగాణలో కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోందంటూ కేటీఆర్ విమర్శించారు. 'విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. వినియోగదారులు జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త బాదుడు షురూ చేస్తారా?' అని ప్రశ్నించారు. 'కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ' అనే వార్తను Xలో షేర్ చేశారు.