మన్మోహన్ సింగ్ 1954లో పంజాబ్ వర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ, 1957లో కేంబ్రిడ్జి వర్శిటీ నుంచి డిగ్రీ పొందారు. 1971లో కేంద్ర వాణిజ్యశాఖలో ఆర్థిక సలహాదారునిగా చేరారు. 1972లో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా, 1980-82 వరకు ప్రణాళికా సంఘం సభ్యునిగా, 1982-85 వరకు RBI గవర్నర్‌గా పని చేశారు. 1990లో పీఎం ఆర్థిక సలహాదారునిగా ఉన్నారు. 1995, 2001, 2007, 2013, 2024లో ఎంపీగా పని చేశారు. 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా, 2004-14 వరకు ప్రధానిగా పని చేశారు.