రైతు భరోసాతో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుందని KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'రైతుబరోసా కొందరకికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్‌కు లేదు. 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది. ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోంది' అని మండిపడ్డారు.