పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మను ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతర బెయిల్‌పై విడుదల అయ్యారు. ఇది ఫిబ్రవరిలోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 22న మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ వెలుపల వేగంగా వస్తున్న ఓ ల్యాండ్ రోవర్ డీసీపీ బెనిటా మేరీ జైకర్ కారును ఢీకొట్టింది. ఆ సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారును విజయ్ శేఖర్ శర్మ వేగంగా నడిపారు. అనంతరం సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తమ కారును ఢీకొట్టిన కారు నంబరును డీసీపీ నోట్ చేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమిక విచారణలో విజయ్ శంకర్ శర్మ వద్ద ఉందని కంపెనీ వ్యక్తులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో విజయ్ శేఖర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది సేపటికే బెయిల్‌పై విడుదల చేశారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.