సెప్టెంబర్ 23 నుంచి 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పవన్ కల్యాణ్‌

51பார்த்தது
సెప్టెంబర్ 23 నుంచి 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పవన్ కల్యాణ్‌
పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన మళ్లీ సినిమా షూటింగ్ లలో పాల్గొననున్నట్లు నిర్ణయించుకున్నారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేపట్టి రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో బిజీ అవ‌డంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. తాజాగా ఆయన నటిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రానికి సంబంధించి మిగిలిన షూటింగ్ కు డేట్స్‌ ఇచ్చారని, సెప్టెంబర్ 23 నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నట్లు మేకర్స్ స్ప‌ష్టం చేశారు. ఇక, క్రిష్‌ స్థానంలో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.

தொடர்புடைய செய்தி