తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది. వరుసగా 33వ నెల రూ.100కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా రూ.111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా రూ.1,253 కోట్ల ఆదాయం లభించింది.