ఏడో రోజు 'వేపకాయల బతుకమ్మ'.. ప్రత్యేకత ఇదే!

55பார்த்தது
ఏడో రోజు 'వేపకాయల బతుకమ్మ'.. ప్రత్యేకత ఇదే!
బతుకమ్మ పండుగలో భాగంగా ఏడోరోజు వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తారు. వేప చెట్టుని ఆదిపరాశక్తికి ప్రతిరూపంగా భావించి, నీరాజనాలు సమర్పిస్తూ వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడు దొంతరలుగా బతుకమ్మను పేరుస్తారు. సకినాలు తయారు చేయడానికి ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.

தொடர்புடைய செய்தி