సమాజ అభివృద్ధి ప్రస్థానంలో వృద్ధుల పాత్ర విస్మరించలేనిది. ముఖ్యంగా కన్నబిడ్డలను ఉన్నత స్థానాల్లో నిలపడానికి అహర్నిశలు శ్రమించిన వృద్ధులు- జీవిత చరమాంకంలో ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. వృద్ధుల మనసు నొప్పించకండి. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఆత్మీయుల కోసం ఎంతగానో ఎదురుచూపులు చూసే మనసు వారిది. ఈరోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.