లింగంపేట్ మండలం మోతెలో గాదం ప్రణీత్ (20) అనే యువకుడు కడుపునొప్పి భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ. అరుణ్ తెలిపారు. సోమవారం ఎస్ఐ మాట్లాడుతూ ప్రణీత్ కడుపు నొప్పితో బాధపడేవాడని, హైదరాబాద్ లో కూలిపని చేస్తూ దసరాకు ఊరికి వచ్చి, దసరా పండుగ ముగించుకొని రాత్రి గదిలోనే ఉరేసుకున్నట్లు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.