నిజామాబాద్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జగన్నాథం అనే న్యాయవాదిని సస్పెండ్ చేసింది. జగన్నాథం ఒక కేసు విషయంలో కొందరిని తీసుకుని కోర్ట్ కు వచ్చాడు. అది గమనించిన బార్ అసోసియేషన్ సెక్రెటరీ వసంత్ కేసు కోసం వచ్చిన వ్యక్తులతో జగన్నాథం సస్పెండ్ అయ్యాడని, కేసులు చేసేందుకు వీలు లేదని తెలిపాడు. దీనితో జగన్నాథం వసంత్ పై దాడికి పాల్పడగా సెక్రెటరీ ముఖంపై గాయాలయ్యాయి. బాధితుడు వసంత్ ఒకటో టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు.