రుణమాఫీలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు పెట్టొద్దని మండల బిజెపి అధ్యక్షులు సరిన్ అన్నారు. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ మధును శనివారం కలిసి రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లాయని చెబుతూ రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని అటువంటి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.