కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామానికి చెందిన గంగని రాములు(50) వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా గురువారం ఉదయం 5: 30 నిమిషాలకు పల్సర్ బైక్ (టీఎస్ 17 కె 4196) ఆగి ఉన్న లారీని (ఏపీ 39 డబ్ల్యూ 8454) ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ సట్టు అనిల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.