కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మొగులన్ పల్లి తాండా గ్రామంలో గేదేలకు గాలికుంటు వ్యాధి సోకాకుండా పశుసంవర్ధక శాఖ వైద్యాధికారుల ఆధ్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంను బుధవారం తనీఖీలు చేసిన బాన్సువాడ పశుసంవర్ధక శాఖ ఏడీ రోహిత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు గేదెలకు, పశువులకు ఎలాంటి గాలికుంటు వ్యాధులు సోకకుండా ఉండాలంటే తప్పక టీకాలు వేయించుకోవాలి అని పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన ఉండాలని రైతులకు సూచించారు. గ్రామంలో 101 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. నారాయణ వీ ఎల్ ఓ, వేంకటేష్ వీఏ, విఠల్ ఓఎస్, గోపాలమిత్రులు మాహేష్ గ్రామ సర్పంచ్ పిబ్లిబాయి తదితరులు పాల్గొన్నారు.