బోధన్: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

67பார்த்தது
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దరి చేరనివ్వవద్దని యాంటి నార్కో బ్యూరో జిల్లా ఇన్చార్జి సోమనాథ్ అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన జీవితం సర్వ నాశనం అవడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. గ్రామాలలో మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி