బోధన్ పట్టణంలో బుధవారం అనిల్ టాకీస్ రోడ్డులో లారీలు లోడింగ్ అన్లోడింగ్ కొరకు పలు షాపుల వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపారు. నిత్యం రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపై ఇలా ఇష్టానుసారంగా వాహనాలు నిలిపితే వాహనదారులు ఎలా వెళ్లాలని వాపోతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోని రోడ్డు పై వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు, పట్టణ వాసులు కోరుతున్నారు.