సాలూర మండల కేంద్రం సాయి కాలనీలో పోతుగంటి వీరయ్య ఇంట్లో గత నాలుగు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్దమైంది. వారికి సహాయం చేసే ప్రయత్నంలో చాకలి సురేష్ అనే వ్యక్తి రెండు కాళ్లు కోల్పోయాడు. పోతిగంటి వీరయ్య కుటుంబానికి
పదహారు వేల మూడు వందల రూపాయలు, 75 కేజీల బియ్యం, అలాగే సాకలి సురేష్ కుటుంబానికి నాలుగు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని బుధవారం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అందజేయడం జరిగింది.