నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని పాండు చెరువు, చెక్కి చెరువులో బుధవారం మత్స్యకార సంఘం పట్టణ అధ్యక్షుడు కోట అబ్బయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ విట్ఠల్, ఏవో సంతోష్ ల చేతుల మీదుగా చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ పథకంలో ఉచితంగా బంగారు తీగ, రాహు, బొచ్చే చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వరుణ్ మత్స్యశాఖ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.