దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాలూర మండలంలోని మందర్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతు నాయకుడు ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో డిస్కో డాన్సులపై నృత్యాలు చేశారు. దేవి మండపాల వద్ద భక్తి పాటలు కాకుండా డాన్సులు చేయడంపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. దేవి మండపం వద్ద డీజే శబ్దాలతో డాన్స్ ప్రదర్శనలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.