శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువకు శనివారం నీటిని విడుదల చేయనున్నట్లు పరీవాహక ప్రాంత రైతులు, చేపలు పట్టువారు, పశువుల కాపరులు కాలువ దరిదాపుల్లోకి రావద్దని ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ వారు శనివారం ప్రకటన విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నుండి క్రమక్రమంగా 6300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.