వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎరుకల ఎల్లయ్యకు సేవా సంస్థ ద్వారా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, బాధిత వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తున్న సమయంలో కాలు జారీ కింద పడటం వల్ల వెన్నుపూసకు బలమైన గాయం అయింది. అప్పటి నుండి చికిత్స కోసం ఎక్కువ మొత్తం లో ఖర్చు చేశారు అన్నారు.