వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నవీపేట్ మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించి ఎమ్మార్వో వెంకట రమణకు వినతిపత్రం అందించారు. మండల బిజెపి అధ్యక్షులు సరీన్ మాట్లాడుతూ ఎన్నికల్లో సన్న ధాన్యానికి 500 బోనస్ ప్రకటించి కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.