నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్చార్జ్ అధికారి నరేందర్ అత్యాశే కొంప మంచిందా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్నపాటి ఉద్యోగిగా చేరి కమిషనర్ స్థాయికి ఎగబాకేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంతేకాక పట్టణంలో బైపాస్ రోడ్డులో 2 ఎకరాల భూమి కొనుగోలు విషయమై బెదిరించడంతో నెలరోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో మాటు వేసి సోదాలు చేసి అరెస్టు చేశారు.