భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు కాలేజీలలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుతున్న విద్యార్థుల బతుకులను భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.