తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీసీటి యాదగిరిరావును
సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ బాడీ కన్వీనర్ డాక్టర్ వి. దత్త హరి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటానని వీసీ హామీ ఇచ్చారని తెలిపారు.