ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో నివసిస్తున్న మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికురాలు వసంత ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్ పర్సన్ 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.