బాసర: కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాసర మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 63 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ 63 చెక్కులను పంపిణి చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పవన్ చంద్ర, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.