బిజెపి పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపీ గోడం నాగేష్ అన్నారు. బుధవారం ముధోల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే కాలంలో భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా మార్చాలన్నారు. యువత కొత్త ఆలోచనలు సాకారం చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు.