నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వెంకటరమణ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం 1999 - 2000 జడ్పీహెచ్ఎస్ఎస్ నర్సాపూర్ పదవ తరగతి క్లాస్ మేట్స్ వెంకటరమణ కుటుంబాన్నీ పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో మిత్రుని కుటుంబానికి అండగా ఉంటామని స్నేహితులు ఈ సందర్భంగా తెలియజేశారు.