నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీ లో సోమవారం రాత్రి కొండ చిలువ కలకలం రేపింది. ఓ ఇంట్లోకి వెళ్తున్న కొండ చిలువ ను గమనించిన స్థానికులు పాములు పట్టే వ్యక్తి ఫయాజ్ కు సమాచారం అందించగా చాక చాకచక్యం పట్టుకుని అటవీ అధికారులకి అప్పగించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ సుమారు 10 అడుగుల ఉంటుందని ఫయాజ్ తెలిపారు.