ఘనంగా మొహర్రం పండుగ

77பார்த்தது
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొహర్రం పండుగను ప్రజలు, భక్తులు ఘనంగా నిర్వహించారు. మొహర్రం పండుగ సందర్భంగా బుధవారం ఖానాపూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నిర్వాహకులు పీరీలను అందంగా తయారు చేశారు. అనంతరం వాటిని పలు గ్రామాల వెంబడి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆయా గ్రామాల ప్రజలు పీరీలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி