అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం లక్ష్మణచాంద మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సుమలత వివరాల ప్రకారం రాచపూర్ గ్రామానికి చెందిన పోశెట్టి (48) మోకాలి నొప్పితో బాధపడుతూ తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.