ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుంది. గడిచిన 24 గంటల్లో 2, 851 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 900 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వరద ప్రవాహం తగ్గినందున అన్ని గేట్లు మూసి ఉంచినట్లు తెలిపారు. వివిధ అవసరాల నిమిత్తం 979 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.