కడెం: ప్రాజెక్టుకు 982 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో

80பார்த்தது
కడెం: ప్రాజెక్టుకు 982 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుందని శనివారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రాజెక్టులో 700 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 982 క్యూసెక్కుల వరద నీరు చేరగా కుడి, ఎడమ కాలువలకు 886 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు మొత్తం కలిపి 895 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.

தொடர்புடைய செய்தி